కరోనా మహమ్మారి ఇక నుంచి జంతువులకు కూడా వ్యాప్తిస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా జింకకు కరోనా వైరస్ సోకినట్టు నిర్దారణైంది. ఇప్పుడు ఈ వైరస్ జంతువుల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడిరచింది. అమెరికాలోని ఒహాయో రాష్ట్రం లోని ఆరు ప్రాంతాల్లో ఉన్న తెల్లతోక జింకలు 129 దాకా కరోనా బారిన పడినట్లు తేలింది. మనుషుల నుంచే జింకలకు ఈ వైరస్ సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ వైరస్‌లో మూడు వేరియంట్లను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఏడాది జనవరి` మార్చి మధ్య ఒహాయో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈశాన్య ఒహాయో లోని తొమ్మిది ప్రాంతాల్లో 360 తెల్లతోక జింకల నాసల్ స్వాబ్స్ సేకరించారు. పీసీఆర్ టెస్టింగు ద్వారా ఇందులోని 129 జింకల్లో (35.8 శాతం) మూడు రకాల వేరియంట్లను గుర్తించారు. గతంలో కూడా కొన్ని ఇతర జంతువులకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే.