టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా నిర్ధారించారు. నాకు కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. కొద్దిపాటి లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స, స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నాను. దయచేసి నాతో కాంటాక్ట్ అయినవారంతా పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకోలేదో వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలా వరకు ప్రమాదకరమైన పరిస్థితి నుండి బయటపడవచ్చు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండండి అంటూ మహేష్ బాబు పేర్కొన్నారు. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంటోంది.