అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కరోనా బారినపడ్డారు. గత రెండు మూడు రోజులుగా జలుబు, దగ్గు వంటి స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నానని, అందులో పాజిటివ్ వచ్చిందని ఆస్టిన్ వెల్లడిరచారు. వైద్యుల సూచన మేరకు ఐదురోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటానని చెప్పారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడిరచారు. తాను పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నానని, గత అక్టోబర్‌లో బూస్టర్ డోస్ కూడా వేసుకున్నానని తెలిపారు. అయినప్పటికీ ఆయన కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. కాగా, చివరిసారిగా డిసెంబర్ 21న అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిసినట్లు వెల్లడిరచారు. ప్రతి ఒక్కరు బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు.
అమెరికాలో ఇప్పటివరకు 5,61,42,175 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 8,47,408 మంది మరణించగా, 4,15,43,060 మంది కోలుకున్నారు. మరో 1,37,51,707 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.