ఇండోనేషియాలో పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 6 నుంచి 11 ఏండ్ల వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాలని ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు 26.5 మిలియన్ల మంది ఉంటారు. పిల్లలకు సినోవాక్ వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు నిర్ణయించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి బుడి గునాడి సాదికిన్ తెలిపారు. ఇందు కోసం 6.4 మిలియన్ల డోసులను వినియోగించనుంది. ఇండోనేషియా వ్యాప్తంగా 0 నుంచి 18 ఏండ్ల వయసున్న పిల్లలు 3,51,336 మంది వైరస్ బారిన పడ్డారు.