నితిన్ హీరోగా శ్రీరామ్‌వేణు దర్శకత్వంలో రూపొందిన చిత్రం తమ్ముడు. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ నటి లయ కీలక పాత్ర పోషించారు. జూలై 4న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల తో ముచ్చటించారు లయ. తమ్ముడులో నా పాత్ర పేరు ఝాన్సీ కిరణ్మయి. నితిన్ అక్కగా కనిపిస్తా. దర్శకుడు శ్రీరామ్‌వేణు ఈ కథ చెప్పినప్పుడు, కరెక్ట్ కమ్‌బ్యాక్ మూవీ అనిపించింది అని అన్నారు. ఈ సినిమాకోసం యూఎస్‌లో నా జాబ్ వదిలేశాను. అవకాశాలు కోరుకున్నప్పుడు రావు. అందుకే ఇండస్ట్రీ మళ్లీ నన్ను పిలిచినప్పుడు కాదనలేకపోయా. ఎంతో కష్టపడి ఈ పాత్ర చేశాను. మారేడుమిల్లి అడవుల్లో రాత్రివేళ చేసిన షూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని జీవితంలో మరిచిపోలేను. కొన్ని సీన్స్‌లో చెప్పుల్లేకుండా నటించాను. చాలా దెబ్బలు తగిలాయి. యాక్టింగ్‌పై ఉన్న ఇష్టం ఆ బాధలన్నింటినీ మరిపించింది అని పేర్కొన్నారు.

లయ వివాహానంతరం భర్తతో కలిసి యూఎస్‌లో స్థిరపడిందామె. సినీపరిశ్రమలో ఏదో ఒకటి సాధించాలనే తపనతోనే మళ్లీ తిరిగొచ్చానని, మంచి పాత్ర అనిపిస్తే మదర్‌గా చేయడానికైనా రెడీ అని, తాను యూఎస్ ఆర్టిస్ట్‌ని కానని, హైదరాబాద్ లోకల్ ఆర్టిస్టునేనని, ఇక్కడ కూడా తనకు ఇల్లు ఉందని, తనకోసం నిర్మాతలు ప్రత్యేకంగా సదుపాయాలను కూడా చూడాల్సిన పనిలేదని లయ పేర్కొన్నారు.
