తెలంగాణలో సిపిఐ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరకపోవడంతో వచ్చే ఎన్నికల్లో సిపిఐ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం 14 స్థానాలకు తమ్మినేని వీరభద్రం అభ్యర్థులకు ప్రకటించారు. మరో మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కాగా, పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తున్నారు.
అభ్యర్థుల వివరాలు:
పాలేరు: తమ్మినేని వీరభద్రం, ముషీరాబాద్: ఎం దశరథ్, ఇబ్రహింపట్నం: పగడాల యాదయ్య, నకిరేకల్: చినవెంకులు, పటాన్ చెరు: జె మల్లికార్జున్, సత్తుపల్లి: భారతి, భద్రాచలం: కారం పుల్లయ్య, వైరా: భూక్యా వీరభద్రం, భువనగిరి: నర్సింహా, జనగామ: మోకు కనకారెడ్డి, ఖమ్మం: శ్రీకాంత్, మిర్యాలగూడ: జూలకంటి రంగారెడ్డి, మధిర: పాలడుగు భాస్కర్, అశ్వారావుపేట:పిట్టల అర్జున్.