నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజీస్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథనందించిన ఈ చిత్రానికి ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాత. ఈ సినిమాలో తమిళ హీరో శింబు, పాడిన టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు అనే పాటను విడుదల చేశారు. శ్రీమణి ఈ గీతాన్ని రాశారు. బ్రేకప్ అయిన యువకుడు పాడుకునే పాట ఇది. చక్కటి సాహిత్యంతో ఆకట్టుకుంటుంది. హృదయాన్ని తడిమే భావోద్వేగాలతో సాగే ప్రేమకథా చిత్రమిది. ప్రేక్షకులకు చక్కటి అనుభూతినిస్తుంది అని చిత్ర బృందం పేర్కొంది. ప్రచార సందడిలో భాగంగా వరుసగా పాటల్ని విడుదల చేస్తున్నారు. ఇటీవలే నన్నయ్య రాసిన అనే పాటని విడుదల చేశారు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొస్తోంది.