నాని హీరోగా నటిస్తున్న సినిమా దసరా. నానికి జోడీగా కీర్తిసురేష్ నటిస్తుంది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుతూ వస్తుంది. ఈ చిత్రంలో ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. చంకీలా అంగిలేసి అంటూ సాగే పాటను మార్చి 8న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నాని, కీర్తి సురేష్ స్కూటర్‌పై వెళ్తున్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే రిలీజైన ధూమ్ ధామ్ ధోస్తాన్, ఓరి వారి పాటలకు శ్రోతల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక ఈ పాట కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని మేకర్స్ థీమా వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు.