లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవా 171కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్. లోకేశ్ కనగరాజ్-రజినీకాంత్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు అప్‌డేట్‌లు ఇస్తారా అని ఫ్యాన్స్ ఎక్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఒక సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ 2024 ఏప్రిల్ నుంచి ఈ మూవీ పట్టాలెక్కబోతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం కథ రాసుకుంటున్న తొందర్లోనే పూర్తి చేసి ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపాడు. ఈ చిత్రాన్ని లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.














