కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రెసిడెంట్ డీ మురళీకృష్ణారెడ్డి, ప్రెసిడెంట్`ఎలక్ట్ ఈ ప్రేమసాగరెడ్డి, సెక్రటరీ కే ఇంద్రసేనారెడ్డి, ఉపాధ్యక్షులు జీ అజయ్‌కుమార్, జగన్‌మోహన్ చిన్నాల, వీ మధుసూదన్ రెడ్డి, జీ పాండురంగారెడ్డి, జాయింట్ సెక్రటరీ జీ శ్రీనివాస్ గౌడ్, ట్రెజరర్ ఎం. ప్రశాంతరావు, క్రెడాయ్ యూత్ వింగ్ తెలంగాణ కో ఆర్డినేటర్ సంకీర్త్ ఆదిత్యరెడ్డి, సెక్రటరీ రోమిత్ అశ్రిత్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. 2021 నుంచి 2023వ సంవత్సరం వరకు ఈ కార్యవర్గం కొనసాగుతుంది.