తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా అన్ని కొవిడ్ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని ప్రాపర్టీ షో నిర్వహించబోతున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ శాఖ ప్రకటించింది. ఆగస్టు 13 నుంచి 15 వరకు జరగనున్న ఈ మెగా షోలో రియల్టర్ల దగ్గర నుంచి నిర్మాణానికి చెందిన అనేక విభాగాల సంస్థలు, రుణాలిచ్చే ఫైనాన్షియర్లు పాల్గొంటారని రామకృష్ణారావు, రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కొనుగోలుదారుల సౌకర్యార్థం విశాలమైన ప్రాంగణంలో 100`150 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. అన్ని వర్గాల బడ్జెట్‌కు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, రిటైల్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరవుతారని పేర్కొన్నారు.