కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. 2021`23కు గానూ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు. అధ్యక్షుడిగా పీ రామకృష్ణరావు, ప్రధాన కార్యదర్శిగా వీ రాజశేఖరరెడ్డిలు తిరిగి నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా జీ ఆనంద్‌రెడ్డి, కంచం రాజేశ్వర్, ఎన్ జయదీప్‌రెడ్డి, బీ జగన్నాథరావు, కోశాధికారిగా ఆదిత్య గౌరాను ఎన్నుకున్నారు. ఇక సంయుక్త కార్యదర్శులుగా కే రాంబాబు, శివాజీ ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా బీ ప్రదీప్‌రెడ్డి, సతీష్‌కుమార్, నితీశ్ రెడ్డి, సంజయ్‌కుమార్ బన్సాల్, ఏ శ్రీనివాస్, కే.క్రాంతికిరణ్ రెడ్డి, ఎన్ వంశీధర్‌రెడ్డి, శ్రీరామ్‌ను ఎన్నుకున్నట్లు రాజశేఖర్ రెడ్డి తెలిపారు.