Namaste NRI

టాలీవుడ్ హీరోయిన్ అకృతి అగర్వాల్‌తో క్రికెటర్ పృథ్వీ షా నిశ్చితార్థం

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా, టాలీవుడ్ నటి మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అకృతి అగర్వాల్‌తో మార్చి 8న నిశ్చితార్థం చేసుకున్నారు. “మైదానంలో సిక్సర్ల నుంచి జీవితాంతం హిట్ల వరకు.. ఆమె నా పరిపూర్ణ ఇన్నింగ్స్” అంటూ, తన ప్రియురాలికి ఉంగరం తొడుగుతున్న ఫోటోలను పృథ్వీ షా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అకృతి అగర్వాల్‌తో చాలా కాలంగా ప్రేమలో ఉన్న పృథ్వీ షా, ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ జంట నిశ్చితార్థం, వారి కొత్త జీవితానికి నాందిగా భావిస్తున్నారు.

అకృతి అగర్వాల్‌ 2003 లో లఖ్నవూలో పుట్టింది. ముంబయిలో నిర్మల మెమోరియల్ ఫౌండేషన్ కాలేజీలో బాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ డిగ్రీ చదివింది. టీనేజ్ లోనే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ఆమె కోసం కుటుంబ ముంబయికి మకాం మార్చింది. కంటెంట్ క్రియేటర్ గా మారి సోషల్ మీడియాలో లిప్ సింక్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యింది. తెలుగులో త్రిముఖ’ సినిమాలో నటించింది.’చోటి సర్దార్, అనే టీవి షో తో హిందీ ప్రేక్షకులకు దగ్గరై , ‘భట్టి గుల్ మ్యూజిక్ ఆల్బం మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆకృతికి ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్‌లో 32 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఆకృతికి క్రికెట్ అంటే ఇష్టం, మైదానానికి వెళ్లి మ్యాచ్ చూస్తుంది, ఇటీవల అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో ఈ జంట కలిసి వెళ్లింది. ఈ జంట ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

అకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా నిశ్చితార్థం మార్చి 8, 2026 న జరిగింది.సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన అంగరంగ వైభవంగా జరిగింది.పృథ్వీ షా మోకాళ్లపై కూర్చుని అకృతికి ఉంగరం తొడుగుతున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.ఈ జోడికి సహచర క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events