
మాస్టర్ రోహన్, అరుణ్, బేబి ఖుషి నటిస్తున్న చిల్డ్రన్ మూవీ సమ్మర్ హాలీడేస్. శ్రీకర్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి క్రష్ సాంగ్ ను హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ ఆదిత్య హాసన్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ చేతుల మీదుగా హైదరాబాద్ లో లాంఛ్ చేశారు. ప్రతి ఒక్కరికి చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తుచేసే చిత్రమిదని, పాటలన్నీ మెలోడీ ప్రధానంగా ఆకట్టుకుంటాయని దర్శకుడు తెలిపారు. ఈ కథ విన్నప్పుడే హార్ట్‌టచింగ్‌గా అనిపించిందని, కథానుగుణంగా సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉందని నిర్మాత ధీరజ్ మొగిలినేని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.





























