హీరో ఆది సాయికుమార్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సీయస్ఐ) ఆఫీసర్‌గా నటిస్తున్న చిత్రం సీఎస్ఐ సనాతన్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 10న విడుదల చేస్తున్నారు. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో అజయ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో చిత్రం పై అంచనాలు బాగా పెరిగాయి. దర్శకుడు మాట్లాడుతూ విక్రమ్ అనే యువ పారిశ్రామిక వేత్త హత్య కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్ ఈ చిత్రంలో కనిపిస్తాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా కథనం నడుస్తుంది అన్నారు. మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జి.శేఖర్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)