నాగచైతన్య హీరో నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. ఈ చిత్రంలో కృతిశెట్టి మరోసారి నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. వెంకట్ ప్రభు డైరెక్టర్. నూతన సంవత్సర కానుకగా కస్టడీ క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్. గ్లింప్స్ వీడియోను మేకర్స్ లాంఛ్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ చిత్రంలో శివ అనే పోలీసాఫీసర్‌గా నాగచైతన్య కనిపించనున్నాడు. కస్టడీ మూవీలో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నారు. వెన్నెల కిశోర్, శరత్‌కుమార్, ప్రేమ్గీ అమరేన్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.














