టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. కృతి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య పోలీసాఫీసర్ శివగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో కనిపిస్తుండగా.. ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుంది. వీరితో పాటు సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా Raaja Live in Concert కోసం హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా అక్కినేని నాగచైతన్య అండ్ కస్టడీ టీం ఇళయరాజాను కలిసింది. ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేసిన చైతూ, తన ఎక్జయిట్‌మెంట్‌ను సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. మాస్ట్రో ఇళయరాజా సర్‌ని కలిసిన సమయంలో నా ముఖంలో పెద్ద చిరునవ్వు. ఆయన కంపోజ్ చేసిన పాటలు నా జీవితంలో ఎన్నో ప్రయాణాల్లోకి తీసుకెళ్లాయి. చాలా సార్లు నా మైండ్‌లో ఓ సీన్‌ను ప్లే చేశా. రాజా సర్ కస్టడీ కోసం పనిచేస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశాడు
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)