Namaste NRI

అమెరికాలో సైబర్‌ దాడి.. నిలిచిపోయిన సేవలు

 అమెరికాలోని పలు దవాఖానలపై సైబర్‌ దాడి జరిగింది. కొందరు హ్యాకర్లు దవాఖానలకు సంబంధించిన కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను హ్యాకింగ్‌ చేయడంతో పలు రాష్ర్టాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.  చాలా ఎమర్జెన్సీ రూములు మూతపడగా, అంబులెన్స్‌లను దారి మళ్లించి చిన్నచిన్న హెల్త్‌ సెంటర్లకు రోగులను తరలించారు. కాలిఫోర్నియా, టెక్సాస్‌, పెన్సిల్వినియా, వాషింగ్టన్‌లతో పాటు పలు ప్రాంతాల్లోని దవాఖానల్లో డాటా ఏక్సెస్‌ కాకపోవడంతో రోగులు అల్లాడారు. సర్జరీలు, ఇన్‌పేషంట్‌, అవుట్‌ పేషంట్‌ సేవలు, ఇతర చికిత్సలు నిలిచిపోయాయి. రోగుల రికార్డులు కూడా చూడలేని పరిస్థితి ఏర్పడటంతో అయోమయ పరిస్థితి ఏర్పడింది.

Social Share Spread Message

Latest News