సాయి ధన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా దక్షిణ. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఓషో తులసీరామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ సైకో థ్రిల్లర్ కథా చిత్రమిది. సాయి ధన్సిక ఐపీఎస్ అధికారిణి పాత్రలో కనిపిస్తారు. ఆమెది పవర్ఫుల్ రోల్. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. హైదరాబాద్, విశాఖపట్టణం, గోవాల్లో చిత్రీకరణ చేశాం. 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. రిషభ్ బసు, సుభాష్, ఆనంద్ భారతి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : నర్సింగ్, సంగీతం : బాలాజీ. నిర్మాణ సంస్థ: కల్ట్ కాన్సెప్ట్స్, నిర్మాత : అశోక్ షిండే, దర్శకత్వం : ఓషో తులసీరామ్.
