Namaste NRI

నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు  హైదరాబాద్ ఫిలించాంబర్‌లో  జరిగాయి. ఉదయం నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. ఈ కౌన్సిల్‌లో  మొత్తం 1134 మంది సభ్యులున్నారు. ఇందులో 678 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల్లో దామోదర ప్రసాద్ అధ్యక్షుడిగా గెలుపొందారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన జెమినీ కిరణ్‌పై  24 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ గెలుపొందారు. ఆయనకు దిల్ రాజు సారథ్యంలోని ప్రొడ్యూసర్స్ గిల్డ్ మద్దతు ఇచ్చింది. ఉపాధ్యక్షులుగా కె. అశోక్ కుమార్, సుప్రియ, కోశాధికారిగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ విజయం సాధించారు. కార్యదర్శులుగా ప్రసన్నకుమార్, వైవీఎస్ చౌదరి, జాయింట్ సెక్రటరీలుగా భరత్ చౌదరి, నట్టికుమార్ ఎన్నికయ్యారు.

15 మంది ఈసీ మెంబర్స్ ..

దిల్ రాజు -470

దానయ్య -421        

రవి కిషోర్ -419

యలమంచిలి రవి -416

పద్మిని -413

బెక్కం వేణుగోపాల్ -406

సురేందర్ రెడ్డి -396

గోపీనాథ్ ఆచంట -353

మధుసూదన్ రెడ్డి -347

కేశవరావు -323

శ్రీనివాద్ వజ్జ -306

అభిషేక్ అగర్వాల్ -297

కృష్ణ తోట -293

రామకృష్ణ గౌడ్ -286

కిషోర్ పూసలు -285.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events