ప్రముఖ నర్తకి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా నాట్యం. నృత్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అతిధిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ తెలుగు చిత్రసీమలో పూర్వవైభవం దిశగా అడుగులు పడుతుండటం ఆనందంగా ఉంది. కూచిపూడి నాట్యం ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తూ గొప్పగా సంధ్యారాజు ఈ సినిమాను తెరకెక్కించారు. స్త్రీశక్తిని చాటిచెప్పే చిత్రమిది. సంకల్పం బలంగా ఉంటే లక్ష్యాల్ని చేరుకోవడం కష్టం కాదని ఈ సినిమాతో నిరూపించారు అని తెలిపారు. రామ్‌చరణ్‌తో పదేళ్లుగా పరిచయముంది. మా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ఆయన చేసిన సహాయం గొప్పది. సమిష్టి కృషి వల్లే సినిమా పూర్తిచేయగలిగాను అని సంధ్యారాజు చెప్పింది. దర్శకుఎడు రేవంత్ మాట్లాడుతూ తెలుగుదనం ఉన్న సినిమా ఇది. ఇలాంటి విభిన్నమైన చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరించినప్పుడే మరిన్ని కొత్త సినిమాలొస్తాయి అని చెప్పారు. సీనియర్ హీరోయిన్ భానుప్రియ కీలక పాత్రలో కనిపించున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.