రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న లెటేస్ట్ సినిమా ధమాకా. ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి దండకడియాల్ దస్తి రుమాల్ మస్తుగున్నోడంటివె పిల్లో అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చడమే కాక సాహిత్యమందించి స్వయంగా ఆలపించారు. ఆయనతో పాటు సాహితీ చాగంటి, మంగ్లీ కూడా గొంతు కలిపారు. జానీ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. వినోదం నిండిన మాస్ యాక్షన్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.
