Namaste NRI

మహిళా రిజర్వేషన్ బిల్లుకు డెన్మార్క్ ఎన్‌ఆర్‌ఐల మద్దతు

భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు పై చేస్తున్న ఆందోళనకు డెన్మార్క్ ఎన్‌ఆర్‌ఐలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ ఆకుల శ్యామ్‌బాబు మాట్లాడుతూ  తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పారని, ఆమె చేపట్టిన ఏ ఉద్యమమైనా సాధించేంత వరకు వదలిపెట్టరని తెలిపారు. బతుకమ్మ ను విశ్వవ్యాప్తం చేయడంలో కవిత పాత్రను ఎవరు విస్మరించలేరని తెలిపారు. గతంలో చేపట్టిన  గిఫ్ట్‌ ఎ హెల్మెట్  పిలుపునందుకుని డెన్మార్క్ లో ప్రచారం చేశామని ఆయన వెల్లడించారు. ఆమె నాయకత్వంలో మహిళలకు చట్టసభల్లో ౩౩శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జయచందర్ గంట, శ్రీనివాస్ రావు బండారి , ఖాజా అక్తర్ ,రాజశేఖర్ గొల్లపూడి ,కృష్ణ చైతన్య నిమ్మలపల్లి , సుఖ్‌దేవ్‌ సింగ్, మహిత పాల్గొన్నారు.   

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events