
విశ్వదేవ్ రాచకొండ, బిందుమాధవి ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రం డార్క్ చాక్లెట్. శశాంక్ శ్రీవాస్తవ్ దర్శకుడు. స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 13న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ లాంచ్ చేశారు. ఈ సినిమా ఆడియన్స్‌కి ఓ మిర్రర్ రిఫ్లెక్షన్లా అనిపిస్తుంది. నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ లాంటి సినిమా ఇది. తెలుగువారు గర్వంగా చెప్పుకునేలా సినిమా ఉంటుంది.
ఈ కథలో చాలా లేయర్లుంటాయి. ఆడియన్స్‌కి ఓ కొత్త అనుభూతినిచ్చే సినిమా అవుతుంది. తరాలపాటు గుర్తుండిపోయే బెంచ్ మార్క్ సినిమా ఇది అని హీరో విశ్వదేవ్ చెప్పారు. ఇలాంటి సినిమా తెలుగులో రాలేదనడంలో సందేహం లేదని దర్శకుడు శశాంక్ శ్రీవాస్తవ్ అన్నారు. ఇంకా నటి బిందుమాధవి, రాకేష్ రాచకొండ, ప్రొడక్షన్ డిజైనర్ నాగవ్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, సమర్పణ: రానా దగ్గుబాటి.















