ప్రియదర్శి, నభానటేష్ జంటగా నటిస్తున్న చిత్రం డార్లింగ్. వై దిస్ కొలవెరి ఉపశీర్షిక. అశ్విన్ రామ్ దర్శకు డు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. నిరంజన్ రెడ్డి నిర్మాత. టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఆద్యంతం వినోదప్రధానంగా గ్లింప్స్ ఆకట్టుకుంది. జీవితంలోని వివిధ దశల్లో ఆడవాళ్ల మనస్తత్వాల గురించి ప్రియదర్శి చెప్పే డైలాగ్స్ వినోదాన్ని పంచాయి. భార్యభర్తల మధ్య నడిచే రొమాంటిక్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారని అర్థమవుతున్నది. ప్రభాస్‌ను ఆయన అభిమానులు ప్రేమగా పిలుచు కునే డార్లింగ్ పదాన్ని తమ సినిమాకు టైటిల్‌గా పెట్టుకోవడం ఆనందంగా ఉందని, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా మెప్పిస్తుందని ప్రియదర్శి తెలిపారు. యాక్సిడెంట్ కారణంగా కొంతకాలం సినిమాలు దూరంగా ఉన్నానని, ఆద్యంతం నవ్వించే కథ ఇదని నభా నటేష్ చెప్పింది. ఈ చిత్రానికి కెమెరా: నరేష్, సంగీతం: వివేక్‌సాగర్, ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ, దర్శకత్వం: అశ్విన్‌రామ్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)