బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్లో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా టైటిల్ను జులై 3న రివీల్ చేయనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా టైటిల్తో పాటు ఓ మాస్ గ్లింప్స్ను కూడా రిలీజ్ చేస్తున్నారట. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్కు మాస్ ప్రేక్షకుల నుంచి తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు స్కంధ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.


