Skip to main content

Namaste NRI

కల్కి ట్రైలర్‌ రిలీజ్‌కి డేట్ ఫిక్స్..వచ్చేది ఎప్పుడంటే?

 ప్రభాస్ న‌టిస్తున్న తాజా చిత్రం కల్కి 2898 ఎ.డి. వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, ఈ సినిమాకు మ‌హాన‌టి ఫేమ్ నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దీపికా ప‌దుకొనే, దిశా ప‌టానీ క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా.. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుద‌ల‌కు ఇంకా 22 రోజులే ఉండ‌డంతో వ‌రుస ప్ర‌మోష‌న్స్ పాల్గోంటుంది క‌ల్కి టీమ్. అయితే ఈ సినిమా ట్రైల‌ర్ కోసం ప్ర‌భాస్ అభిమానులు ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ట్రైల‌ర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు మేక‌ర్స్. ఈ మూవీ ట్రైల‌ర్‌ను జూన్ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనితో పాటు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. జూన్‌ 27న ప్రేక్ష‌కుల ముందుకు సినిమా రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events