
నాగసాధువుగా తమన్నా భాటియా నటించిన సూపర్ నాచురల్ పాన్ ఇండియా థ్రిల్లర్ ఓదెల 2. అశోక్‌తేజ దర్శకుడు. డి.మధు నిర్మాత. సంపత్ నంది దర్శకత్వ పర్వవేక్షణలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని ఈ నెల 8న ముంబయ్‌లో జరిగే ఓ ఈవెంట్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలిపారు. ఈ సినిమా ప్రారంభోత్సవం కాశీలో చేశాం. టీజర్‌ను కుంభమేళాలో విడుదల చేశాం. ట్రైలర్‌ని ముంబయ్‌లో విడుదల చేయనున్నాం. తెలుగుతోపాటు హిందీ ట్రైలర్‌ని కూడా అదే వేదికపై విడుదల చేస్తాం. సినిమాపై అంచనాలు పెంచేలా ట్రైలర్ ఉంటుంది అని మేకర్స్ తెలిపారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్.సింహా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో యువ, నాగమహేశ్, వంశీ, గగన్ విహారీ, సురేందర్‌రెడ్డి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్.ఎస్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాణం: మధు క్రియేషన్స్, సంపత్‌నంది టీమ్ వర్క్స్.
