హర్యానా రాష్ట్ర గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. చంఢీగఢ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా ఆయనతో ప్రమాణం చేయించారు. చంఢీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా పని చేసిన ఆయన ఇటీవల హర్యానాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతి తక్కువ మంది ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. హర్యానాకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్, ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌటాలా మరికొందరు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.