ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్ వాడుతున్నారు. అయితే వాట్సాప్ స్టేటస్‌లు పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే తిప్పలు తప్పువు. పాకిస్థాన్‌కు చెందిన అనీకా అతీక్ అనే 26 ఏళ్ల యువతి వాట్సాప్ స్టేటస్ పెట్టినందుకు 2020 మే నెలలో ఆమె అరెస్టయింది. మహమ్మద్ ప్రవక్త చిత్రాలతో పాటు కొన్ని దైవ దూషణలకు సంబంధించిన వాక్యాలను ఆమె తన స్టేటస్‌లో పెట్టింది. ఇవి చూసిన ఒక మిత్రుడు వాటిని మార్చాలని అనీకాకు సూచించాడు. అయితే ఆ మాట వినని ఆమె తన దగ్గరున్న సదరు చిత్రాలు, వాక్యాలను మిత్రుడికి ఫార్వర్డ్ చేసింది. ఇస్లాం మతంలో మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన చిత్రాలపై నిషేధం ఉన్న సగంతి తెలిసిందే. ఇవి గీసినందుకే ఫ్రాన్స్‌లో ఒక మ్యాగజైన్ కంపెనీపై కాల్పులు కూడా జరిగాయి. ముస్లింలు అధికంగా ఉండే పాకిస్థాన్ వంటి దేశాల్లో దైవదూషణ చాలా సున్నితమైన అంశంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)