రోషన్, ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభన్, అనిరుధ్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం అరంగేట్రం. శ్రీనివాస్ ప్రభన్ దర్శకుడు. మహేశ్వరి.కె నిర్మాత. ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ సైకో బేస్డ్ కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుంది. కుటుంబ నేపథ్యానికి అలరించే ప్రేమకథను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆరుగురు అమ్మాయిల, ముగ్గురు అబ్బాయిల మధ్య కొనసాగే ఈ కథలో ప్రతి పాత్ర ఎంతో కొత్తగా ఉంటుంది. తప్పకుండా చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. మే 5న ఈ చిత్రం విడుదల కాబోతుంది.