Skip to main content

Namaste NRI

ఉగాది బరిలో డెకాయిట్

అడివి శేష్‌ నటిస్తున్న ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ డెకాయిట్‌. మృణాళ్‌ ఠాకూర్‌ కథానాయిక. షానియల్‌ డియో దర్శకత్వం లో ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తు న్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంలోనే అడివి శేష్‌, మృణాళ్‌ఠాకూర్‌ ఇంటెన్స్‌ లుక్స్‌లో కనిపిస్తున్న రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అందర్నీ ఆకట్టుకున్నాయని, జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించే సినిమా ఇదని మేకర్స్‌ నమ్మకం వెలిబుచ్చారు. ఈ చిత్రం 2026 ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కానున్నది. బాలీవుడ్‌ దర్శక, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

Social Share Spread Message

Latest News