
కిరణ్, అలేఖ్య రెడ్డి జంటగా నటించిన చిత్రం దీక్ష. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించారు. సందేశంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించారు. చిత్రీకణ పూర్తయిందని, జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ పేర్కొన్నారు. దర్శకనిర్మాత ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ సంకల్ప బలం ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చనే సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, కథలోని మైథలాజికల్ ఎలిమెంట్ ఆసక్తికరంగా ఉంటుందని, ఆక్సఖాన్ ప్రత్యేక గీతం యువతను ఆకట్టుకుంటుందని చెప్పారు.దీని తర్వాత తమ సంస్థలో కబడ్డీ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు తీసేలా ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్.కె.ఫిల్మ్స్, సిగ్ధ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కిరణ్ సంగీత దర్శకుడు. ఆర్.కె.గౌడ్, పి.అశోక్‌కుమార్ నిర్మాతలు.
