
కిరణ్, అలేఖ్యరెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం దీక్ష. స్వీయ దర్శకనిర్మాణంలో ప్రతాని రామకృష్ణగౌడ్ రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవొచ్చనే స్ఫూర్తివంతమైన పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుంది. కథలోని మైథాలజికల్ పాయింట్ ఆసక్తికరంగా ఉంటుంది. కథానుగుణంగా సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్ ఐదు చక్కటి పాటలిచ్చారు. మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ సినిమాలో తాను ప్రత్యేకగీతంలో నర్తించానని ఆక్సఖాన్ తెలిపింది. ఆర్.కె.ఫిల్మ్స్, సిగ్ధ క్రియేషన్స్ పతాకాలపై ఆర్.కె.గౌడ్, పి.అశోక్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
