దీపక్ సరోజ్, దీక్షిక, అనైరా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీలక్ష్మీ నరసింహ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తన్నీరు హరిబాబు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వేణు ఊడుగుల క్లాప్‌నిచ్చారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ వినూత్న ప్రేమకథగా తెరకెక్కించబో తున్నామని, నేటి యువతరం కనెక్ట్ అయ్యే అన్ని అంశాలుంటాయని తెలిపారు.
నిర్మాతగా తనకిది తొలి చిత్రమని, జనవరిలో షూటింగ్ మొదలుపెట్టి ఏప్రిల్‌లో కంప్లీట్ చేస్తామని తన్నీరు హరిబాబు పేర్కొన్నారు. రఘుబాబు, హైపర్ ఆది, సత్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు, సంగీతం: అనూప్ రూబెన్స్, రచన-దర్శకత్వం: హరీష్ గదగాని.