
అహ్మదాబాద్ విమాన ప్రమాదం పై బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ స్పందించారు. ఈ మేరకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బ్రిటీష్ పౌరులతో లండన్ వెళ్తున్న విమానం అహ్మదాబాద్‌లో కూలిపోయిందని, పరిస్థితిపై భారత్‌ను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. బ్రిటీష్ జాతీయులతో లండన్ వెళ్తున్ ఎయిర్ ఇండియా విమానం భారతదేశంలోని అహ్మదాబాద్ నగరంలో కూలిపోయింది. ఆ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. పరిస్థితిపై భారత్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకుంటున్నాం. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు.
