Skip to main content

Namaste NRI

ప్రాజెక్ట్-K నుంచి దీపికా పదుకొనె ఫస్ట్ లుక్

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ప్రాజెక్ట్ కె. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే, దిశా పటానీ నటిస్తున్నారు. వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.  కాగా తాజాగా ఈ సినిమా నుంచి దీపికా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నాచురల్ లుక్ లో ఉన్న దీపికా పోస్టర్ అదిరిపోయింది. గ్లింప్స్ రిలీజయ్యే వరకు ప్రతీ రోజు ఈ సినిమాలో మేయిన్ కాస్ట్ పోస్టర్లను రివీల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, కమల్ హాసన్‌, దిశా పటాని స్టార్ కాస్ట్  నటిస్తుంది. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్‌బీ అమితాబ్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కమల్‌ హాసన్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సంక్రాంతికి టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్నా, షూటింగ్‌ ఇంకా చాలా పెండింగ్‌ ఉండటంతో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events