Namaste NRI

దీపికా పడుకోన్‌ అరుదైన ఘనత

ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన కల్కి చిత్రం వెండితెరపై ఓ సరికొత్త ప్రపంచాన్ని సాక్షాత్కరింపజేస్తూ విజువల్‌ వండర్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నది. తొలి రెండు రోజుల్లో 298కోట్ల కలెక్షన్స్‌ సాధించి లాంగ్న్‌ల్రో వెయ్యికోట్ల మార్క్‌ను దాటొచ్చనే నమ్మకాన్ని కలిగిస్తున్నది. ఈ సినిమాలో సుమతి పాత్రలో దీపికా పడుకోన్‌ అభినయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. కల్కి చిత్రం ద్వారా దీపికా పడుకోన్‌ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దీపికా సినీ కెరీర్‌లోనే హయ్యెస్ట్‌ ఓపెనింగ్‌ డే కలెక్షన్లు సాధించిన చిత్రంగా కల్కి నిలిచింది. ఇప్పటివరకు హిందీలో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌ చిత్రాలతో పాటు రోహిత్‌శెట్టి కాప్‌ యూనివర్స్‌ వంటి భారీ చిత్రాల్లో భాగమైంది దీపికా పడుకోన్‌.

అయితే ఈ చిత్రాలను అధిగమిస్తూ తొలి రోజు అత్యధిక వసూళ్లతో కల్కి రికార్డు సృష్టించింది. గత ఏడాది దీపికా పడుకోన్‌ నటించిన పఠాన్‌ చిత్రం తొలి రోజు 106కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది. తాజాగా కల్కి తొలి రోజు 191 కోట్ల వసూళ్లతో రికార్డు క్రియేట్‌ చేసింది. తన కెరీర్‌లోనే ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా కల్కి దీపికా పడుకోన్‌ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచిపోనుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events