బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం స్పిరిట్ ఆఫ్ ఫైటర్ . ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్-మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం. ఈ మూవీలో దీపికా పదుకొనే, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా దీపికాపదుకొనే పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. దీపిక ఇందులో ఎయిర్ డ్రాగన్ యూనిట్‌లో పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా కనిపించనుంది. ఇప్పటికే హృతిక్ రోషన్ రోల్‌కు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. ఎయిర్ డ్రాగన్స్ విభాగంలో స్క్వాడ్రన్ పైలట్ గా పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా కనిపించబోతున్నట్టు తెలియజేస్తూ, విడుదల చేసిన లుక్‌లో సూపర్ హ్యాండ్ సమ్‌గా కనిపిస్తున్నాడు హృతిక్ రోషన్.
ఫైటర్ టీజర్‌ను డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. సిల్వర్ స్క్రీన్‌పై హృతిక్ రోషన్, దీపికా పదుకొనే క్రేజీ కాంబో తొలిసారి కలిసి కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్‌తో మూవీ లవర్స్, అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు హృతిక్ రోషన్. ఈ నేపథ్యంలో ఇప్పటికే విదేశాల్లో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు హృతిక్ రోషన్. ఫైటర్ 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.