ప్రొ కబడ్డీ లీగ్ 2021లో తెలుగు టైటాన్స్ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ జట్టు 39`37 తో తెలుగు టైటాన్స్‌ను ఓడిరచింది. హరియాణా తరపున మీతూ 12 పాయింట్లు, రోహిత్ గులియా 8, రవి కుమార్ 4, సురేందర్ నాడా 3, విశాక్ , జల్దీప్ చెరో ఒక పాయింట్ తెచ్చారు. తెలుగు టైటాన్స్ తరపున సిద్ధార్థ్ దేశాయ్ 9, అంకిత్ చెరో 9 పాయింట్లు సాధించగా రాకేశ్ 7, ఆదర్శ్ 3, రుతురాజ్ 2, అరుణ్ 2, ఆకాశ్ ఓ పాయింట్ సాధించారు. తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌తో టై చేసుకున్న తెలుగు టైటాన్స్. రెండో మ్యాచ్ పుణెరిలో పల్టాన్ చేతిలో ఓటమి చవిచూసింది.