Namaste NRI

40 నిమిషాల్లోనే ఢిల్లీ టు శాన్‌ఫ్రాన్సిస్కో!

వ్యోమనౌక అంటే వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లేది అనే అర్థం మారే అవకాశం ఉన్నది. వ్యోమ నౌకను సూపర్‌ఫాస్ట్‌ విమానంగా వినియోగించేందుకు స్పేస్‌ఎక్స్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ కొత్త ప్రణాళికలు రచిస్తు న్నట్టు తెలుస్తున్నది. ప్రపంచంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించాలని మస్క్‌ భావిస్తున్నారట. తన స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన స్టార్‌షిప్‌ వ్యోమనౌక ద్వారా అంగారకుడిపైకి మనుషులను పంపించాలని ఇంతకాలంగా మస్క్‌ ప్రణాళిక. అయితే, భూమిపై మనుషుల ప్రయాణ సమయాన్ని తగ్గించేం దుకు స్టార్‌షిప్‌ను వినియోగించాలని మస్క్‌ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలిసింది. స్టార్‌షిప్‌ ద్వారా సాధారణ విమాన ప్రయాణ దూరాన్ని దాదాపు 2,200 శాతం తగ్గించొచ్చని మస్క్‌ భావిస్తున్నారు.

మొదట అమెరికాలోని న్యూయార్క్‌ నుంచి చైనాలోని షాంఘై మధ్య స్టార్‌షిప్‌ను నడిపించాలని మస్క్‌ ప్రణాళి కలు రచిస్తున్నట్టు తెలిసింది. ఈ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణ దూరం దాదాపుగా 14 గంటల 50 నిమిషాలు. స్టార్‌షిప్‌లో మాత్రం 39 నిమిషాల్లో చేరుకోవచ్చట. గంటకు 27 వేల కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించే సామర్థ్యం స్టార్‌షిప్‌ వ్యోమనౌకకు ఉంది. రెండో దశలో లండన్‌ నుంచి న్యూయార్క్‌కు, పారిస్‌ నుంచి న్యూయార్క్‌కు, ఢిల్లీ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోకు సైతం స్టార్‌షిప్‌ను నడిపించాలని మస్క్‌ భావిస్తు న్నారట. ఇది కనుక అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం బాగా తగ్గి ఢిల్లీ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోకు కేవలం 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.

Social Share Spread Message

Latest News