Skip to main content

Namaste NRI

మహేంద్రగిరి వారాహికి లభిస్తున్న ఆదరణపై హర్షం : థ్యాంక్స్ మీట్‌లో హీరో సుమంత్

సుమంత్‌ ఆనందం కథానాయకుడిగా రూపొందిన డివైన్‌ థ్రిల్లర్‌ మహేంద్రగిరి వరాహి. సిద్ధు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్ర పోషించారు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో కలిపు మధు, లక్ష్మణ్‌ కలిసి నిర్మించిన ఈ చిత్రం విడుదలై థియేటర్లలో ప్రదర్శింపబడుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో సుమంత్‌ మాట్లాడారు. ఈ సినిమా గురించి అంతా గొప్పగా మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది. గ్రౌండ్‌ లెవల్లో టాక్‌ పాజిటివ్‌గా ఉన్నది. ఈ టాక్‌ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలామంచి ఫ్యూచర్‌ ఉండే సినిమా ఇది అంటూ హీరో సుమంత్‌ ఆనందం వెలిబుచ్చారు.

స్పందన చూస్తుంటే సంతోషంగా ఉందని, ైక్లెమాక్స్‌ ట్విస్ట్‌ జనానికి ఎలా కనెక్టవుతుందో అనే భయం ఉండేదని, ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారని దర్శకుడు సంతోష్‌ జాగర్లమూడి అన్నారు. తెలుగులోనే కాక, ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వస్తున్నదని నిర్మాత మధు తెలిపారు. ఇంకా వంశీ చాగంటి, మీనాక్షి కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events