అగ్రరాజ్యం అమెరికాను డెల్టా వేరియంట్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. రోజూ లక్షకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. కొత్త కేసుల్లో 99 శాతం డెల్టా వేరియంట్‌కు సంబంధించినవే కావడం వేరియంట్ తీవ్రతను తెలియజేస్తున్నది. మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నది. రోజుకు సగటున 2 వేల మంది మృత్యువాత పడుతున్నారు. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,579 మంది కరోనాతో చనిపోయారు. కేసుల విజృంభణకు డెల్టా వేరియంట్ కారణం అని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన సంస్థ (సీడీసీ) తెలిపింది. వైరస్ తీవ్రత ఫ్లోరిడా, టెక్సస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నది.