Skip to main content

Namaste NRI

శిల్పారామంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శిల్పారామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీల వినియోగం ద్వారా మన చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యావరణ సంపదను ప్రపంచానికి పరిచయం చేస్తాం అన్నారు.

పీపీపీ (PPP) పద్ధతిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, హోటళ్ల కల్పనతో పాటు పెట్టుబడులను పెద్దఎత్తున ఆహ్వానిస్తున్నాం. వారాంతాల్లో విశ్రాంతి కోసం హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను స్థానిక పర్యాటకం వైపు ప్రోత్సహించేలా టూరిజం కూపన్లు వంటి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించాం.

ఈ సందర్భంగా నూతన టూరిజం వెబ్‌సైట్, కాఫీ టేబుల్ బుక్, ఏఆర్/వీఆర్ కంటెంట్‌లను ఆవిష్కరించడంతో పాటు పురావస్తు శాఖ – ఏఎస్ఐ మధ్య ఎంవోయూ కుదిరింది. తెలంగాణ పర్యాటక కీర్తిని విశ్వవ్యాప్తం చేయడానికి కట్టుబడి ఉన్నాం అన్నారు, ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events