Namaste NRI

అనుకున్న సమయానికే దేవర

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం దేవర. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ పతాకాలపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్నది. హై ఇంటెన్సిటీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో పాటు గ్రాఫిక్స్‌ ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు.  అయితే ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే భారీ యాక్షన్‌ హంగులతో తీస్తున్న సినిమా కావడంతో ముందుగా ప్రకటించిన తేదీకి రిలీజ్‌ అవుతుందో లేదో అని అభిమానుల్లో సందేహం ఉంది. ఈ విషయం గురించి చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. అనుకున్న సమయానికే రాబోతున్నామంటూ సోషల్‌మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. సముద్ర తీర ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేయబోతున్నామని ప్రారంభం రోజునే ప్రకటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events