Namaste NRI

గోవాలో దేవర షూటింగ్‌

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం. జాన్వీ కపూర్‌ కథానాయిక. రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా తొలి భాగం అక్టోబర్‌ 10 విడుదల కానుంది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ గోవాలో మొదలైంది. రాజు సుందరం నృత్య దర్శకత్వంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లొకేషన్‌ వర్కింగ్‌ స్టిల్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ మాస్‌ అవతారంలో కనిపిస్తున్నారు.

విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతంలో తన వారిని రక్షించుకోవడానికి ధీరోదాత్తుడైన కథానాయకుడు చేసిన పోరాటం, ఈ క్రమంలో అతనికి ఎదురైన అవరోధాలు ఏమిటన్నదే ఈ చిత్ర కథాంశం. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా, అత్యున్నత సాంకేతిక హంగులతో తెరకెక్కిస్తున్నారు. కొద్ది వారాల క్రితం విడుదల చేసిన గ్లింప్స్‌లో ఎన్టీఆర్‌ శక్తివంతంగా కనిపించారు. బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుధ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబు సిరిల్‌, నిర్మాణ సంస్థలు: ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌, నిర్మాతలు: మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె, సమర్పణ: నందమూరి కల్యాణ్‌రామ్‌, దర్శకత్వం: కొరటాల శివ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress