![](https://namastenri.net/wp-content/uploads/2024/09/Mayfair-99.jpg)
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మ్యూజిక్ కంపోజర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప ది రూల్‌తోపాటు పలు ప్రధాన భాషల లీడింగ్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ కంపోజర్ ప్రధాని నరేంద్రమోదీ తో ప్రత్యక్షమైన స్టిల్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ డీఎస్పీ, మోదీని ఎక్కడ కలిశారనే కదా మీ డౌటు. న్యూయార్క్ లో జరిగిన ఓ కల్చరల్ ఈవెంట్‌కు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే ఈవెంట్లో ఈ ఇద్దరు ఇలా ఒక్కచోట కలిసిపోయారు. ఈవెంట్లో పర్ఫార్మెన్స్ అయిన తర్వాత స్టేజ్‌పైకి వచ్చిన మోదీ డీఎస్పీని ఆత్మీయంగా హగ్ చేసుకుని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ, మోదీ చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/Ixora-99.png)