Skip to main content

Namaste NRI

ప్రధాని మోదీతో దేవీ శ్రీ ప్రసాద్‌

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మ్యూజిక్‌ కంపోజర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప ది రూల్‌తోపాటు పలు ప్రధాన భాషల లీడింగ్‌ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ కంపోజర్ ప్రధాని నరేంద్రమోదీ తో ప్రత్యక్షమైన స్టిల్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ డీఎస్పీ, మోదీని ఎక్కడ కలిశారనే కదా మీ డౌటు. న్యూయార్క్‌ లో జరిగిన ఓ కల్చరల్‌ ఈవెంట్‌కు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే ఈవెంట్‌లో ఈ ఇద్దరు ఇలా ఒక్కచోట కలిసిపోయారు. ఈవెంట్‌లో పర్‌ఫార్మెన్స్‌ అయిన తర్వాత స్టేజ్‌పైకి వచ్చిన మోదీ డీఎస్పీని ఆత్మీయంగా హగ్ చేసుకుని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ, మోదీ చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

Social Share Spread Message

Latest News