
ఆది సాయికుమార్, అవికాగోర్ జంటగా నటిస్తున్న డివోషనల్ థ్రిల్లర్ షణ్ముఖ. షణ్ముగం సాప్పని దర్శకుడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది సాయికుమార్ మాట్లాడుతూ విడుదలకు ముందే ఈ సినిమా అన్ని భాషల డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోవడం ఆనందంగా ఉంది. కుటుంబ సమేతంగా చూడదగిన డివోషనల్ థ్రిల్లర్ ఇది అన్నారు. తన కెరీర్‌లో ఇదొక ప్రత్యేక చిత్రమని, విభిన్నమైన పాత్రలో కనిపిస్తానని అవికా గోర్ తెలిపింది. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని వినూత్నమైన పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, విజువల్ వండర్‌లా ఆకట్టుకుంటుందని దర్శకనిర్మాత షణ్ముగం సాప్పని పేర్కొన్నారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, నిర్మాతలు: తులసీరామ్, షణ్ముగం, రమేష్ యాదవ్, దర్శకత్వం: షణ్ముగం సాప్పని.
