ధనుష్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇడ్లీ కడై. ఆకాష్ భాస్కరన్ నిర్మాత. దర్శకుడిగా ధనుష్‌కి ఇది నాల్గవ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.ఇడ్లీ బండి దగ్గర పిల్లలు నిల్చునివుండగా, టైటిల్‌ను పరిచయం చేస్తూ ఈ పోస్టర్ ఉన్నది. తమ ప్రొడక్షన్ హౌస్ డాన్ పిక్చర్స్‌కు ఈ సినిమా మైలురాయిగా నిలుస్తుందని, ధనుష్‌తో కలిసి తొలి ప్రాజెక్ట్ చేయడం ఆనందంగా ఉందని నిర్మాత తెలిపారు. నిత్యామీనన్ మరోసారి ధనుష్‌తో జతకట్టనున్న ఈ సినిమాకు కెమెరా: కిరణ్ కౌశిక్, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, నిర్మాణం: డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్.